‘ఓపెన్ టాక్’ సిరీస్.. సరికొత్త వేదికకు శ్రీకారం చుట్టిన బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

by Shyam |   ( Updated:2021-10-11 21:34:50.0  )
‘ఓపెన్ టాక్’ సిరీస్.. సరికొత్త వేదికకు శ్రీకారం చుట్టిన బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ విభాగం ఒక సరికొత్త వేదికకు శ్రీకారం చుడుతున్నది. ‘సార్వత్రిక సామాజిక వేదిక’ అనే పేరుతో ఈ విభాగం ఆన్‌లైన్ ద్వారా మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈ కొత్త వేదికను ప్రారంభిస్తున్నది. యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ కె. సీతారామారావు ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి మాజీ వీసీ ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ సైతం ముఖ్య అతిథిగా హాజరై ‘విశ్వవిద్యాలయలు – వాటి సామాజిక బాధ్యతలు’ అనే అంశంపై ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ‘ఓపెన్ టాక్’ సిరీస్ పేరుతో వరుస ప్రసంగాలను ఈ వేదిక ద్వారా విశ్వవిద్యాలయానికి చెందిన సోషల్ సైన్సెస్ అందించాలనుకుంటున్నది.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన అకడమిక్ డీన్ ప్రొఫెసర్ ఇ.సుధారాణి, రిజిస్టర్ డాక్టర్ జి.లక్ష్మారెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ విభాగం డీన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, కోఆర్డినేటర్ డాక్టర్ కె.కృష్ణారెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని విభాగం డీన్ ప్రొఫెసర ఘంటా చక్రపాణి ఒక ప్రకటనలో తెలిపారు. ‘జూమ్’ ప్లాట్‌ఫారంపై మాత్రమే కాక యూట్యూబ్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చని పేర్కొన్నారు. ‘జూమ్’ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు ఈ క్రింది యూజర్ ఐడీ, పాస్‌కోడ్ వాడాలని సూచించారు.

యూజర్ ఐడీ : 89 5043 5506

పాస్ కోడ్ : 618025

యూట్యూబ్ లింక్ : https://www.youtube.com/channel/UC5oNhiYTUea1IYS_40ACTtw

Advertisement

Next Story