- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మధ్యంతర బడ్జెట్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సీఈఓ
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ప్రభుత్వం 2024-25 సంవత్సరాలకు గాను పార్లమెంట్‌లో మధ్యంతర బడ్డెట్‌ను ప్రవేశ పెట్టింది. దీనిపై నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా సీఈవో ఆశిష్ చౌహాన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో కేంద్రమంత్రి స్పీచ్ తర్వాత.. ఆయన మీడియాతో మాట్లాడారు.."బడ్జెట్ ప్రసంగం చదువుతున్నప్పుడు, నాకు వృద్ధి, సంక్షేమం, ఆర్థిక సంయమనం అనే మూడు పదాలు గుర్తుకు వచ్చాయి. ఈ మూడింటిని ఒకేసారి సాధించడం చాలా కష్టం. ప్రభుత్వం మూడు లక్ష్యాలను పెట్టుకుంది.
ఈ క్రమంలో వారు ఒక్కో చోట ఇటుక-ఇటుక పేర్చుకుంటూ.. భారతదేశంలోని ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే సామాజిక భద్రతా ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించగలిగారు. వారు గత 10 సంవత్సరాలుగా నిరూపించారు. గడిచిన 10 సంవత్సరాలలో రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాల పరంగా లాజిస్టిక్స్ ధర ఒక్క అంకెకు తగ్గింది. అది చాలా స్వాగతించదగిన చర్య. వందే భారత్‌లో అభివృద్ధి చేసిన ఆటమణిర్భర్ టెక్నాలజీ, అనేక మెట్రోలు లాజిస్టిక్స్ ధరను మరింత తగ్గించబోతున్నాయని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా సీఈవో శిష్ చౌహాన్ అభిప్రాయపడ్డారు.