చట్టాల సవరణకు అంగీకరించాం : కిషన్ రెడ్డి

by Shyam |
చట్టాల సవరణకు అంగీకరించాం : కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొత్త చట్టాల వల్ల రైతులకు నష్టం లేదని అన్నారు. కార్పొరేట్లకు లాభం చేయడానికి చట్టాలు తీసుకురాలేని స్పష్టం చేశారు. అంతేగాకుండా మోడీ ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ మోసం చేయదని అభిప్రాయపడ్డారు. రైతులకు లాభం చేకూర్చే చట్టాలను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

చట్టాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల చట్టాల్లో కొన్ని సవరణలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని గుర్తు చేశారు. రైతులతో మాట్లాడి 8 అంశాలపై సవరణకు అంగీకరించామని వెల్లడించారు. దీనిపై రైతులకు నమ్మకం కలిగేలా లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చామని తెలిపారు. దీనికి మెజార్జీ రైతులు సానుకూలంగా స్పందించారని అన్నారు. తర్వాత బయటకు వెళ్లి మూడు చట్టాలు రద్దు చేయమన్నారని వెల్లడించారు. మూస పద్ధతి వ్యవసాయంతో ఇన్నేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఇక నుంచైనా రైతులు లాభ పడాలన్న ఉద్దేశంతోనే కొత్త చట్టాలు తీసుకొచ్చామని అన్నారు.

Advertisement

Next Story