- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కిషన్ రెడ్డి నిరూపిస్తే.. నేను రాజీనామా చేస్తా : హరీష్ రావు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. శుక్రవారం హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా నేను చర్చకు వస్తా.. కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి వాస్తవాలు మాట్లాడాలి చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. సిలిండర్ ధరపై రాష్ట్ర పన్ను రూ.291 అని నిరూపిస్తే, నేను రాజీనామా చేస్తా అని మంత్రి హరీష్ రావు సంచలన ఛాలెంజ్ చేశారు.
కాగా, హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటలను ఓడించేందుకే TRS నేతలు పూర్తిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారికి కూడా కనీస గుర్తింపు లేదని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలపై రాష్ట్రం రూ.291 పన్నులు విధించి, కేంద్రంపై విమర్శలు చేయడం సరికాదని ఆరోపించారు. దీనికి మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.