- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీలకు అతీతంగా పోరాడిన నేత వెంకటస్వామి
దిశ, ముషీరాబాద్:
పేద ప్రజల కోసం పార్టీలకు అతీతంగా పోరాడిన నేత వెంకటస్వామి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. పేదలకు గుడిసెలు వేయించి వారి మనసుల్లో గుడిసెల వెంకటస్వామిగా చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) 91వ జయంతిని పురస్కరించుకొని టాంక్ బండ్ పై నున్న ఆయన విగ్రహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లడుతూ… రాష్ట్రపతి కావాల్సిన మహానాయకుడు కాకా అని కొనియాడారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేస్తోందన్నారు. అనంతరం డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ… గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన నేత కాకా అని అన్నారు. తెలంగాణ సాధనలో క్రియాశీలకంగా పనిచేసిన గొప్ప నాయకుడు వెంకటస్వామి అని కొనియాడారు.