బీజేపీలోకి ఈటల.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Shamantha N |
బీజేపీలోకి ఈటల.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీలో మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేరికపై సానుకూల వాతావరణ ఉందని కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించడానికి అందరూ కలిసి రావాలని అన్నారు. పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి అసంతృప్తిని పార్టీలో చర్చిస్తామని వెల్లడించారు. అయితే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఇవాళ సాయంత్రం కీలక సమావేశం ఉన్న సంగతి తెలిసిందే. ఈ భేటీలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులను నడ్డాకు ఈటల వివరించనున్నట్లు సమాచారం. అంతేగాకుండా.. ఈ వారంలోనే ఈటల బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా బీజేపీ తాను నిర్వహించాల్సిన పాత్రపై ఈటల నడ్డాతో చర్చించనున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story