చైనా మంత్రికి జయశంకర్ ఫోన్.. చర్చకు వచ్చిన కీలక అంశాలు

by Shamantha N |
చైనా మంత్రికి జయశంకర్ ఫోన్.. చర్చకు వచ్చిన కీలక అంశాలు
X

దిశ,వెబ్‌డెస్క్: చైనా విదేశాంగ మంత్రితో కేంద్ర మంత్రి జయశంకర్ ఫోన్‌లో సంభాషించారు. వారిద్దరి మధ్య సుమారు 75 నిమిషాల పాటు సంభాషణ జరిగింది. ఈ సందర్బంగా తూర్పు లద్దాఖ్ సహా భారత్-చైనా సంబంధాలపై చర్చించారు. ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించాలని భారత్ కోరింది. దౌత్య, సైనిక పద్దతుల ద్వారా సంబంధాలు కొనసాగించాలని ఆయన కోరారు. కాగా పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణపై చైనా మంత్రి వాంగ్ యీ సంతృప్తి వ్యక్తం చేసినట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story