‘టీకా.. ఒక సంజీవనిగా గుర్తుండిపోతుంది’

by sudharani |
‘టీకా.. ఒక సంజీవనిగా గుర్తుండిపోతుంది’
X

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సమీక్షించారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో టీకా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కరోనా అంతానికి ఇది ఆరంభమని, ఇన్నాళ్ల పోరాటానికి కొత్తగా కరోనా టీకా ఆయుధంగా అందిందని పేర్కొన్నారు. కరోనాపై విజయానికి టీకాను ఒక సంజీవనిగా ఎప్పటికీ గుర్తుంచుకుంటారని వివరించారు. మశూచీ, పోలియోల తర్వాత ఇప్పుడు కొవిడ్ వంతు అని, ఈ టీకాతో కొవిడ్‌ను అంతమొందిస్తామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ప్రిన్సిపల్ లేదా అదనపు ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో టీకా పంపిణీ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను సమీక్షించారు. తొలి రోజు టీకా పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టినందున రాష్ట్రాల మంత్రులను ఆయన అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed