వాహనదారులకు షాక్.. పెట్రో ధరలపై కీలక ప్రకటన

by Shamantha N |   ( Updated:2021-09-23 05:06:52.0  )
petrol
X

దిశ, డైనమిక్ బ్యూరో : పెట్రోలు ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. కానీ, రాష్ట్రాలు ఏకాభిప్రాయంలోకి రాకపోవడంతో ఎలాంటి నిర్ణయం రాలేదు. అయితే, తాజాగా.. కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కోల్‌కత్తాలోని భవానీపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

పెట్రోలు, డీజిల్ వస్తువులను జీఎస్టీలో కి తీసుకొచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నా.. రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర బ్యారెల్‌కు 19 డాలర్లు ఉన్నప్పుడు కూడా.. పెట్రోల్‌పై రూ.32 పన్ను వసూలు చేశామని, ఇప్పుడు బ్యారెల్‌కు 75 డాలర్లు ఉన్నా.. కేంద్రం రూ.32 మాత్రమే వసూలు చేస్తోందని వెల్లడించారు. ఇలా వచ్చిన పన్నులతోనే.. ఉచిత రేషన్, ఉచిత గృహాలు, ఉజ్వల వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed