ఏదైనా ఒకటే టీకా తీసుకోవాలి: మనోహర్

by Shamantha N |   ( Updated:2021-01-15 07:14:43.0  )
ఏదైనా ఒకటే టీకా తీసుకోవాలి: మనోహర్
X

దిశ,వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ లేఖ రాశారు. క్లీనికల్ ట్రయల్స్‌లో గర్భవతి, పాలిచ్చే మహిళలను భాగం చేయలేదని తెలిపారు. లబ్దిదారులు ఏదైనా ఒకటే టీకా తీసుకోవాలని స్పష్టం చేశారు. మొదటి టీకా ఏది తీసుకుంటే అదే టీకా రెండో దఫా కూడా తీసుకోవాలని చెప్పారు. టీకాలను 18 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వారికే ఇవ్వాలని ఆదేశించారు.

Advertisement

Next Story