బ్లాక్ ఫంగస్ ఎక్కువగా వారికే సోకుతుంది : కేంద్రమంత్రి

by Shamantha N |
Union Health Minister Harsh Vardhan
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నుంచి కోలుకున్న కొందరిలో వెలుగుచూస్తున్న బ్లాక్ ఫంగస్‌ను అవగాహనతోనే అరికట్టవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతుండడంతో దాని నివారణ, నియంత్రణపై ఆయన శుక్రవారం పలు సూచనలు చేశారు. ఈ ఫంగస్‌ను తొలినాళ్లలోనే గుర్తించి చికిత్స చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా నిరోధించవచ్చని ఆయన తెలిపారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు, సోకితే తీసుకునే చర్యలపై ట్విట్టర్‌లో పలు వివరాలను వెల్లడించారు. ‘‘బ్లాక్ ఫంగస్ ఎక్కువగా అనారోగ్యంతో బాధపడే వారికే సోకుతోంది. ఇతర రోగికారక క్రిములతో పోరాడే శక్తిని తగ్గించేస్తోంది. ఇతర వాధ్యులు, వొరికొనజోల్ ఔషధాలు వాడేవారు, మధుమేహం ఎక్కువగా ఉన్నవారు, స్టెరాయిడ్లు వాడకంతో ఇమ్యూనిటీ తగ్గిపోయినవారు, ఐసీయూలో ఎక్కువ కాలం ఉన్న వారికి బ్లాక్ ఫంగస్ ఎక్కువగా సోకుతోంది.’’ అని ట్వీట్ చేశారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కర్నాటకతో పాటు తెలంగాణలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed