కేంద్ర మంత్రివర్గ సమావేశం రద్దు

by Anukaran |
pm-modi-cabinet
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ సమావేశం రద్దయింది. దీనితోపాటు క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్ అనే మరో కమిటీ సమావేశం కూడా రద్దయింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకోవడంలో సీసీఈఏ సమావేశం కీలకమైనది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరగనున్నందున ప్రతి బుధవారం జరగాల్సిన సాధారణ కేబినెట్ సమావేశాన్ని రద్దు చేయాలని మోడీ నిర్ణయించినట్లు తెలిసింది. కొత్తగా దాదాపు పాతికమంది మంత్రులు క్యాబినెట్లోకి వస్తున్నందున ప్రమాణ స్వీకార ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో మొత్తం మంత్రి వర్గం సమావేశం కావడంతోపాటు క్యాబినెట్ సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. ఇందుకోసమే ఈరోజు ఉదయం జరగాల్సిన సమావేశాన్ని అర్ధాంతరంగా రద్దు చేసినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed