గుర్తు తెలియని మృతదేహం లభ్యం

by Sridhar Babu |
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
X

దిశ,పాలేరు: ఖమ్మం జిల్లాలో గుర్తు తెలియని మృత దేహం లభ్యమైంది. కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఇన్ టెక్ వెల్ ప్రక్కన రైతు వేదిక భవనానికి సమీపంలో ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కూసుమంచి ఎస్సై ఇంద్రసేనా రెడ్డి… మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటుందని, వైట్ షర్ట్, వాయిలెట్ కలర్ జీన్స్ ప్యాంట్స్ ధరించి ఉన్నాడని తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే కూసుమంచి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై ఇంద్రసేనా రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed