రాబోయే 9 నెలల్లో ఇండియాలో 2 కోట్ల జననాలు: యూనిసెఫ్

by Shamantha N |
రాబోయే 9 నెలల్లో ఇండియాలో 2 కోట్ల జననాలు: యూనిసెఫ్
X

పారీస్ : కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో లాక్‌డౌన్ విధించారు. ప్రజలందరూ ఇండ్లకే పరిమితమవడంతో జంటల మధ్య సెక్స్ పెరిగిందని.. దీంతో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు గణనీయంగా పెరగనున్నట్లు యూనిసెఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ జననాల రేటు ఇండియాలోనే రికార్డు స్థాయిలో ఉండనున్నట్లు ఆ సంస్థ వివరించింది. దేశంలో మార్చి చివరి వారం నుంచి లాక్‌డౌన్ అమలు కానుండటంతో రాబోయే తొమ్మిది నెలల్లో 2 కోట్ల మంది పిల్లలు పుడతారని యునిసెఫ్ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 11.6 కోట్ల మంది పిల్లలు జన్మిస్తారని చెప్పింది. సరైన గర్భనిరోధక సాధనాలు ఉపయోగించకపోవడం వల్లే ఎక్కువ శాతం గర్భాలకు కారణమవుతున్నాయని కూడా పేర్కొంది. అయితే ఈ కరోనా సంక్షోభ సమయంలో గర్భిణిలు చాలా జాగ్రత్తగా ఉండాలని.. రోగ నిరోధక శక్తిని పెంచే అహారాన్ని తీసుకోవాలని యునిసెఫ్ సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పుట్టబోయే పిల్లలను ప్రమాదంలోనికి నెట్టేసినట్లేనని ఆ సంస్థ పేర్కొంది. అయితే గతేడాదితో పొల్చుకుంటే ఈ ఏడాది ఇండియాలో పుట్టే వాళ్ల సంఖ్య తక్కువేనని.. 2015 నుంచి ఈ దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గుతోందని యునిసెఫ్ చెప్పింది.

యునిసెఫ్ అంచానా ప్రకారం ఇతర దేశాల్లో జననాల సంఖ్య:

చైనా – 1.35 కోట్లు
నైజీరియా – 64 లక్షలు
పాకిస్తాన్ – 50 లక్షలు
ఇండోనేషియా – 40 లక్షలు

Tags : UNICEF, United Nations, Birth Rate, India, Coronavirus, Lock Down

Advertisement

Next Story

Most Viewed