రక్షణ కోసం పెడితే.. భక్షించిన కరెంట్ తీగలు

by Shyam |
naresh
X

దిశ చేవెళ్ల: మండలంలోని దామరగిద్ద గ్రామంలో గురువారం బ్యాగారి నరేష్ తన సొంత పొలంలో ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు ప్రమాదవశాత్తు తగిలి మరణించాడు. పంట పొలాలకు కుటుంబ సభ్యులు రాత్రివేళల్లో అడవి పందుల రాకుండా రక్షణ కోసం కరెంటు తీగలను అమర్చారు. ఉదయం పూట ఆ తీగలను తొలగించకుండా అలాగే ఉంచారు.

ఈ విషయం తెలియకుండా నరేష్ మధ్యాహ్నం 3-30 నిమిషాలకు పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. అయితే తీగలకు కరెంట్ లేదని భావించి, చేనులోకి దిగుతున్న సమయంలో తీగ కాలికి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టూ ప్రక్కల పంటపొలాల వారు గమనించి కుటుంబ సభ్యులకు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన జరిగిన స్థలానికి వెంటనే పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story