రాజన్న జిల్లాలో డ్రైనేజీ పనులు జరిగేనా.. వారి బాధలు తీరేనా ?

by Sridhar Babu |   ( Updated:2021-12-14 23:07:13.0  )
రాజన్న జిల్లాలో డ్రైనేజీ పనులు జరిగేనా.. వారి బాధలు తీరేనా ?
X

దిశ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని రామకృష్ణాపూర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలో నిలిచిన నీరు వెళ్ళిపోయే విధంగా చేశారు కానీ, డ్రైనేజీ శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోందని ఆవేదన చెందుతున్నారు. అలాగే డ్రైనేజీ పనులు మధ్యలో నిలిచిపోయినప్పటికీ దాని గురించి పట్టించుకోకుండా (మమ) అనిపించారని ఆరోపిస్తున్నారు. అధికారులు, పాలకవర్గం ప్రజల సమస్యలను మొక్కుబడిగా తీర్చకుండా పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు.

మొదటి నుంచి పాలకవర్గానికి, అధికారులకు మా కాలనీ పై చిన్నచూపు ఉంది. కాలనీలో ఉన్న పలు సమస్యల పరిష్కారం తూతూ మంత్రంగానే చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో వాటి పై దృష్టి సారించడం లేదని స్థానికులు వాపోతున్నారు.

ఈ డ్రైనేజీ విషయంపై స్థానిక సెక్రెటరీ‌తో దిశ ప్రతినిధి ఫోన్‌లో సంప్రదించగా పైపులను ఆర్డర్ పెట్టాము కానీ ఇంకా రాలేదు. రెండు లేదా నాలుగు రోజుల్లో డ్రైనేజీ‌ని పైప్లైన్ ద్వారా సరిచేసి కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పారు. పూర్తిస్థాయిలో డ్రైనేజీ‌ని శుభ్రం చేసి సమస్య తీరుస్తామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed