- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగర్‌లో బీజేపీకి ఊహించని షాక్.. టీఆర్ఎస్‌లోకి కీలక నేతలు
దిశ ప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్ నేతలను గుంజేద్దామనుకున్న బీజేపీకి చేదు అనుభవం తప్పడంలేదు. అవతలి పార్టీ నుంచి లాక్కోవడమేమోగానీ స్వంత పార్టీ నేతలు టీఆర్ఎస్‌లోకి వెళ్ళకుండా అడ్డుకోలేకపోతోంది. నిన్నమొన్నటివరకూ కడారి అంజయ్య యాదవ్ తనకు సాగర్‌లో పోటీ చేసే అవకాశం వస్తుందేమోనని ఎదురుచూశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి భార్య నివేదిత కూడా అదే ఆశతో ఉన్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరినీ కాదని డాక్టర్ రవి కుమార్ కు టికెట్ ఖరారు చేయడంతో ఈ ముగ్గురూ టీఆర్ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. శ్రీధర్ రెడ్డి, నివేదిత రెడ్డి హైదరాబాద్ వచ్చి తెలంగాణ భవన్‌లోనే టీఆర్ఎస్‌లో చేరవచ్చనే వార్తలు సాగర్ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో కడారి అంజయ్య యాదవ్ కూడా దాదాపుగా టీఆర్ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలిసింది.
తొలుత బీజేపీ రెబల్‌గా పోటీ చేయాలని ఆలోచించిన అంజయ్య యాదవ్ చివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు పైళ్ళ శేఖర్‌రెడ్డి, రవీంద్రకుమార్ నాయక్, సైదిరెడ్డి తదితరులు జరిపిన మంతనాలతో టీఆర్ఎస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అంజయ్యయాదవ్ మధ్యాహ్నాం 2 గంటలకు హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఇదిలావుంటే.. టీఆర్ఎస్ నుంచి బలమైన నేతను లాక్కుని బీజేపీ నుంచి బరిలోకి దించాలని అధిష్టానం తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ‘కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక’ ఉండిపోయిందన్న చందంగా బీజేపీ పరిస్థితి మారింది. టీఆర్ఎస్ నుంచి నేతలను లాక్కోవడం సంగతేమో గానీ బీజేపీ నేతలే టీఆర్ఎస్‌లోకి క్యూ కట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, ఆయన భార్య నివేదిత కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. టికెట్ తప్పకుండా వస్తుందని చివరి వరకూ నమ్మకంతో ఉన్నా చేజారిపోవడంతో పార్టీని వీడడమే ఉత్తమం అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. సాగర్ నియోజకవర్గంలో జిన్నింగ్ మిల్లుకు సంబంధించిన సబ్సిడీలు, రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన కొన్ని అనుమతులు అనివార్యం కావడంతో ఆ దిశగా అధికార పార్టీ వీరిద్దరికీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఆ ప్రకారమే వీరు టీఆర్ఎస్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు సమాచారం.