- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాల్క సుమన్‌కు సొంత నియోజకవర్గంలో ఊహించని షాక్
దిశ, చెన్నూర్: ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు సొంత నియోజకవర్గంలో ఊహించని షాక్ తగిలింది. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దళితబంధు పథకం ద్వారా నియోజకవర్గంలోని దళితుల అభివృద్ధికి కృషి చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు సుశీల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని అంబేడ్కర్ చౌక్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం మాట్లాడారు.
ఈటల రాజేందర్ రాజీనామాతో సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం ద్వారా రూ.10 లక్షల అందిస్తామని ప్రకటించాడని తెలిపారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ దళిత బంధు పథకానికి కారకుడయ్యాడని, అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసి దళిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్, సీనియర్ నాయకుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షుడు కొంపెల్లి బనేశ్, పెండ్యాల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్, పొన్నం రవితేజ, తలారి రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.