భారతీయుడి సైకత శిల్పానికి యూఎస్‌ఈపీ ప్రశంస

by Shyam |
World-Environment-Day
X

దిశ, ఫీచర్స్: సమకాలీన పరిస్థితులు, సమస్యలు ప్రతిబింబించేలా ఇసుకతో అద్భుతమైన శిల్పాలను తయారుచేసే ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ గురించి తెలిసిందే. కాగా శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒడిశాలోని పూరి సముద్రతీరంలో ఆయన రూపొందించిన ఆర్ట్‌కు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్(యూఎన్‌ఈపీ) సైతం ఆయన ప్రతిభను మెచ్చుకుంది.

పర్యావరణ దినోత్సవం సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ ఏడు టన్నుల ఇసుకతో 8 అడుగుల వెడల్పు, 13 అడుగుల పొడవుతో ‘రీఇమాజిన్, రీక్రియేట్, రీస్టోర్’ అనే మెసేజ్‌తో కూడిన సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ మేరకు సురక్షిత వాతావరణంలో ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపాలనే సందేశాన్ని ఇచ్చాడు. కాగా ఈ ఆర్ట్‌ను చూసి స్పందించిన యూఎన్‌పీఈ.. ‘తరాల పునరుద్ధరణ ఆవశ్యకతను తెలిపేలా అందమైన కళాకృతిని తయారుచేసిన అంతర్జాతీయ సైకత శిల్పకళాకారుడికి కృతజ్ఞతలు’ అని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసి, అందుకు సంబంధించిన సైకత చిత్రాలను కూడా జతచేసింది.

యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ నుంచి ప్రశంసలు దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు సుదర్శన్ తెలిపాడు. కాగా అత్యవసర పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచేందుకు, చర్యలు తీసుకునేందుకు రాజకీయ వేగాన్ని పెంచడానికి ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు.

Advertisement

Next Story