హుజూరాబాద్ నుంచే నిరుద్యోగ బంధు ఇవ్వాలి

by Shyam |
హుజూరాబాద్ నుంచే నిరుద్యోగ బంధు ఇవ్వాలి
X

దిశ,తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ నుంచే నిరుద్యోగ బంధు పథకం ప్రారంభించి నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ డిమాండ్ చేశారు. ఇటివలే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఇల్లంతుకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన నిరుద్యోగి మహ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని సోమవారం మానవతారాయ్ పరామర్శించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకు రూ.30 లక్షల ఆర్థిక సాయాన్ని నిరుద్యోగ బంధు పథకం ద్వారా ఇవ్వాలని సూచించారు.

ఓయూ జేఏసీ చైర్మన్ కొప్పుల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నిరుద్యోగికి ఈ పథకం ద్వారా రూ.5 లక్షలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా జాప్యం చేయకుండా 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని లేకుంటే నిరుద్యోగుల ఉసురు తాకుతుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న షబ్బీర్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.30 లక్షలు, మూడెకరాల పొలం, డబుల్ బెడ్రూం ఇళ్లు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఫోన్ లో షబ్బీర్ తండ్రి మహమ్మద్ అంకుస్ ను ఆమె పరామర్శించారు.

మనవతారాయ్ వెంట కేయూ జేఏసీ చైర్మన్ ఇట్టబోయిన తిరుపతి యాదవ్, కేయూ జేఏసీ అధ్యక్షుడు వినోద్ లోక్ నాయక్, కేయూ జేఏసీ కన్వీనర్‌ మేడ రంజిత్ కుమార్, కేయూ జేఏసీ నేతలు గజ్జల మల్లేశ్, గుజ్జుల శ్రీనివాసరెడ్డి, నల్లా ప్రవీణ్, నిరుద్యోగ జేఏసీ అధికార ప్రతినిధి బండ మధు, రామిరెడ్డి లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed