తండ్రితో గొడవ.. ఇంట్లోంచి బయటకొచ్చి రైలు పట్టాలపై శవమై తేలి..!

by Sridhar Babu |
Dudh Durantho Train
X

దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ నగర శివారులోని గుంటూరు పల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో గల రైలు పట్టాలపై ఆదివారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టాలపై ఉన్న మృతదేహాన్ని స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు మృతుడి జేబులో ఉన్న ఆధారాలను బట్టి మానకొండూర్ మండలం వెల్డీ గ్రామానికి చెందిన కనకం వంశీ (22)గా గుర్తించారు. మృతుడు తన తండ్రి శంకరయ్యతో గొడవపడి తల్లి, తమ్ముడితో కలిసి మూడు రోజుల క్రితం నగరానికి వచ్చి గోదాం గడ్డలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నట్టు కుటుంబసభ్యుల ద్వారా తెలుస్తోంది. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం వేటలో ఉండగా.. తండ్రితో విభేదించి బయటకొచ్చిన రోజుల వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story