ప్రభుత్వం పై పిటిషన్ కు సిద్దమైన నిరుద్యోగులు.. ఎందుకంటే ?

by Shyam |   ( Updated:2021-09-20 06:54:02.0  )
un-emplois
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకోపోవడంపై హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ క్రమంలో సోమవారం ట్విట్టర్లో ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని వైట్ చాలెంజ్ విసరగా.. ఆయన(కేటీఆర్) కోర్టులో తేల్చుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై మండి పడుతున్న నిరుద్యోగ యువకులు ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ.. ప్రభుత్వం చేసిన తప్పుడు హామీలపై హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో యువత సూసైడ్ చేసుకోవడానికి కారణం ప్రభుత్వ తప్పుడు హామీలేనని కోర్టులో మా గొంతు వినిపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువకులు కోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ భారీగా ట్వీట్లు చేస్తుండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed