- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు మహిళ టోకరా.. చివరకు..
దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని వికలాంగుల కాలనీకి చెందిన మేఘన సరస్వతి అనే మహిళ తన భర్త రాంబాబుతో కలిసి నిరుద్యోగులకు టోకరా వేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి అశ్వరావుపేట, హైదరాబాద్, తిరువూరుకు చెందిన సుమారు 120 మంది నిరుద్యోగుల వద్ద రూ. 2కోట్ల వరకు వసూలు చేశారు.
ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు గత నెల 26న పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మేఘన సరస్వతి, భర్త రాంబాబు పారిపోవడంతో బాధితులు వారి ఇంటి వద్ద మాటు వేసి మంగళవారం రోజు భార్యాభర్తలను పట్టుకున్నారు. ఈ క్రమంలో ఇంటివద్ద వారికి దేహశుద్ధి చేశారు.
చుట్టుపక్కల వారు 100 కి కాల్ చేయడంతో పోలీసులు వచ్చి వారికి అడ్డుకున్నారు. ఈ లోపు దెబ్బలు తిన్న మహిళకు ఫిట్స్ రావడంతో పోలీసులు సదరు మహిళను తమ వాహనంలోనే పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు. కేసు నమోదు విచారణ చేపట్టారు.