పిల్లలకు మనమిచ్చే నిజమైన ఆస్తి ‘చదువే’ : సీఎం జగన్

by srinivas |
cm jagan
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ సోమవారం ప్రారంభించారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేశారు. 2020–21 ఏడాదికి గాను ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొదటి విడతను కంప్యూటర్‌ బటన్‌ నొక్కి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. సుమారు 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రూ.671.45 కోట్లు విడుదలయ్యాయి. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువే అని అన్నారు. చదువుతోనే మన రూపురేఖలు మారిపోతాయని చెప్పారు.

రాష్ట్రంలో పిల్లల ప్రతీ అడుగులో ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసానిచ్చారు. 2018-19లో బకాయిలు రూ.1800 కోట్లను ప్రభుత్వమే చెల్లించిందని వివరించారు. 2019-20 ఏడాదికి గాను గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తి నిధులు రూ. 1774.60 కోట్లు తమ ప్రభుత్వం క్లియర్ చేసిందని జగన్ వెల్లడించారు. విద్యాదీవెన కింద ఇప్పటివరకు మొత్తం రూ.4879కోట్లు విద్యార్థుల తల్లుల అకౌంట్లో జమ చేశామన్నారు.

Advertisement

Next Story

Most Viewed