ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్టులు

by Shyam |
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వ్యాప్తి పెరుగుతుండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని0 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్షలను బుధ‌వారం నుంచి ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 50 సెంటర్స్ , రంగారెడ్డిలోని 20 సెంటర్స్, మేడ్చల్‌లోని 20 సెంటర్స్‌ల‌లో ఈ టెస్ట్‌లను నిర్వహించనున్నారు.

ఒక్కో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం(అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్)లో మ్యాక్సిమం 25 శాంపిల్స్ తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. క‌రో‌నా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి, ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులకు మాత్రమే పరీక్షలు చేయాల‌ని అధికారులు స్పష్టంచేశారు. 30 నిమిషాల్లోనే ఈ టెస్టులకు సంబంధించి రిపోర్టు వెలువడనుంది. దీంతో కరోనా అనుమానితులు ముందు త‌మ‌కే చేయాలని ముందుకు వస్తున్నారు. అయితే, ఎవరిని ముందు సెలెక్ట్ చేయాలో హెల్త్ సిబ్బందికి అర్ధం కాని ప‌రిస్థితి నెలకొన్నది. 15 నుంచి 30 నిమిషాల్లో రిపోర్ట్ రాక‌పోతే ఈ టెస్టులను‌ ఫాల్స్ రిజల్ట్‌గా పరిగణిస్తారు.

Advertisement

Next Story

Most Viewed