- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలలో మత్తు కలిపి.. కొడలిపై మామ అత్యాచారం
దిశ, వెడ్ డెస్క్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామంధుడు సమానంగా చూసుకోవాల్సిన కోడలిపై కనికరం లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసినప్పటికీ భర్త ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ అభాగ్యురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు 19 ఏళ్ల యువతి ఆరు నెలల క్రితం పెళ్లయ్యింది. అయితే భర్త, అత్తమామలతో కలిసి జార్ఖండ్‌లోని జంషేడ్ పూర్‌లో నివాసం ఉంటోంది. అయితే కొత్త పెళ్లి కూతురిపై కట్టుకున్న భర్త తండ్రే కన్నేశాడు. ఎప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో కోడలిని పరోక్షంగా తన కోరికలను తీర్చమని అడిగేవాడు. అయితే భర్తకు చెప్పేందుకు భయపడేది. అంతేకాదు అవసరం ఉన్నా లేకున్నా కోడలి శరీరంలో తాకరాని చోట్ల తాకేవాడు. అయితే భర్తకు చెప్పినా అతడు పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదు తన తండ్రి అలాంటి వాడు కాదని వెనకేసుకొచ్చాడు. ఇక గతవారం బాధితురాలి భర్త పనిమీద రాంచీ వెళ్లాడు. ఇదే అదనుగా భావించి మామగారు. ఆమె తాగే పాలలో మత్తు మందు ట్యాబ్లెట్లు కలిపాడు. మామ పాడు బుద్ధి గురించి తెలియని ఆమె అమాయకంగా పాలను తాగేసింది. కొద్ది సేపటికే మైకం కమ్మి నిద్రలోకి జారిపోయింది. ఉదయం లేచేసరికి తాను అత్యాచారానికి గురైనట్టు తెలుసుకుంది. అది కూడా తన మామగారరే తనపై అత్యాచారం చేశాడన్న నిజాన్ని ఆమె నమ్మలేకపోయింది. వెంటనే అత్తగారి వద్దకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పి వాపోయింది. అయితే ఆమె ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ చుట్టుపక్కల వాళ్లు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. తనపై అత్యాచారం చేసిన మామకు ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని పోలీసులకు వేడుకుంది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్నంతా చెప్పి అక్కడే కుప్పకూలిపోయింది. పోలీసులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. భర్త, అత్తగారిపై కూడా విచారణ జరుగుతోందని వివరించారు.