బెడ్ రూమ్‌లో కోడలితో మామ శృంగారం.. అది చూసిన భర్త.. చివరకు

by Sumithra |   ( Updated:2021-07-05 05:27:21.0  )
crime news
X

దిశ, వెబ్‌డెస్క్: కోడలిని కన్న కూతురిలా చూసుకోవాల్సిన మామ ఆ వరుసను మరిచాడు. భర్తనే ప్రాణంగా ప్రేమించాల్సిన ఆమె విచక్షణ మరిచింది. తండ్రిలా చూసుకోవాల్సిన మామతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొడుకు ఇంట్లోలేని సమయంలో మామ కోడళ్లు రాసలీలల్లో మునిగి తేలారు. చివరికి ఒకరోజు వారి బాగోతం కొడుకు ముందు బట్టబయలయ్యింది. కన్న తండ్రి, కట్టుకున్న భార్య ఒకే బెడ్ పై నగ్నంగా దర్శనమిచ్చేసరికి ఆ కొడుకు గుండె ముక్కలయింది. ఆ కోపం తీవ్ర రూపం దాల్చి వారిద్దరినీ హతమార్చాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. గోకలహార్ గ్రామానికి చెందిన అమన్ లోధి తన కుమారుడు సంతోష్ లోధి(35), కోడలు కవిత(32) లతో కలిసి నివాసముంటున్నాడు. అయితే గత కొంత కాలంగా కవిత తన మామ అమన్ లోధి తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త సంతోష్ ఇంట్లో లేనప్పుడు మామ తో కలిసి రాసలీలలు సాగించేది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అర్ద రాత్రి మామ, కోడలు కలిసి బెడ్ రూమ్ లో కామ్ క్రెడల్లో మునిగితేలుతుండగా భర్త సంతోష్ వారిద్దరిని చూసి రగిలిపోయాడు.

తండ్రి, భార్యపై కోపంతో రగిలిపోయిన సంతోష్ ఇంట్లో ఉన్న కత్తితో వారిద్దరిని హతమార్చాడు. ఈ ఘటనపై సంతోష్ బంధువు ఒకరు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఉదయం పోలీసులు వచ్చి చూసే సరికి అమన్, కవిత మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. సంతోష్ తన తండ్రిని, భార్యను అభ్యంతరకర పరిస్థితిలో చూసి తట్టుకోలేక వారిద్దరిని తానే హతమార్చానని అంగీకరించడంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం కోర్టు లో హాజరు పరిచారు.

పెళ్లిలో వరుడి తల్లి చేసిన ఆ పనికి షాక్‌లో వధువు.. వీడియో వైరల్

Advertisement

Next Story