- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్‌లో టీఆర్ఎస్‌కు షాక్
దిశ, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నియోజకవర్గ పరిధిలోని డిచ్‌పల్లి మండలానికి చెందిన ఎంపీపీ గద్దె భూమన్న, నలుగురు ఎంపీటీసీలు, తొమ్మిది మంది సర్పంచ్‌లు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం వారు బీజేపీలో చేరడానికి మాజీ జడ్పీటీసీ కులచారి దినేశ్ ఆధ్వర్యంలో ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ఈ సందర్బంగా మాజీ జడ్పీటీసీ కులచారి దినేష్ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఎంపీపీ గద్దె భూమన్నతో సహా, ఎనిమిది మంది సర్పంచ్‌లు, నలుగురు ఎంపీటీసీలు, బీజేపీలో చేరుతారని తెలిపారు.
రూరల్ మండలాల్లో ఎక్కువ శాతం యువకులు సర్పంచ్‌లుగా ఉన్నారనీ… వారు గ్రామాల వృద్ధికి పాటు పడుతున్నారని చెప్పారు. వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిచేయి చూపుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో గ్రామాలకు అధికమొత్తంలో కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరవుతున్నాయని అన్నారు. వాటిపై ఎమ్మెల్యేల పెత్తనం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
నేడు మోపాల్ మండలం ప్రజాప్రతినిధులు మూకుమ్మడి రాజీనామా?
టీఆర్ఎస్ పార్టీతో ఒరిగేదేమీలేదని రోజురోజుకూ రూరల్ నియోజక పరిధిలోని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మొపాల్ మండల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి, సభ్యత్వానికి ఆదివారం రాజీనామా చేస్తారని సమాచారం.