- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వింటర్ వేవ్ కరోనా.. అప్రమత్తత అవసరం!
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ తీవ్ర స్థాయికి చేరుకుంది. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనా కేసులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఇప్పటికే ఆరు నెలలు గదుస్తున్నా.. వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఇక రాబోయే చలికాలంలో కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. అక్కడ చలికాలంలో వైరస్ మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వింటర్ వేవ్ ఆఫ్ కరోనా (సెకండ్ వేవ్) విజృంభిస్తే.. యూకేలో 1,20,000 మంది మరణించే అవకాశం ఉన్నట్లు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన సీనియర్ వైద్యులు, శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
బ్రిటన్‌లో వింటర్ టైమ్ నందు కరోనా తీవ్రత ఎలా ఉంటుందనే విషయంపై ప్రభుత్వం 37 మంది నిపుణులతో నియమించిన ప్రత్యేక బృందం ఓ నివేదిక రూపొందించింది. తీవ్రత ఎక్కువ స్థాయిలోనే ఉండనుందని, ముందస్తు చర్యలు తీసుకోవడమే కాక, అందరూ అలర్ట్‌గా ఉంటేనే.. కరోనా సెకండ్ వేవ్ నష్టాన్ని తగ్గించుకోవచ్చని ఆ నివేదికలో తేలింది. ప్రస్తుతం వైరస్ తీవ్రత గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టిందని, ఈ సమయాన్ని యుటిలైజ్ చేసుకుంటే.. రాబోయే రోజుల్లో వచ్చే ముప్పుని తప్పించుకునే అవకాశం ఉందని వైద్యులు, శాస్త్రవేత్తలతో కూడిన నిపుణుల బృందం అభిప్రాయపడింది. ఇప్పటివరకు యూకేలో 44,830 అధికారిక మరణాలు నమోదు కాగా, జూలైలోనే 1,100 మరణాలు సంభవించాయి. గతంతో పోలిస్తే.. కాస్త తగ్గినట్టుగా కనిపించింది.
అప్రమత్తత అవసరం..
చల్లటి వాతావరణంలో వైరస్ వేగంగా సోకుతుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా అనేక మంది వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. తాజా నివేదిక బ్రిటన్‌కే పరిమితమైనప్పటికీ.. మిగతా ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా వైరస్ చల్లటి వాతావరణంలో ఎక్కువ కాలం జీవించగలదని తెలిపారు. అందువల్ల రాబోయే చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనదేశంలో చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ఎక్కువగానే ఉంటాయి. ప్రధానంగా శ్వాసకోశ వ్యాధుల ప్రభావం ఎక్కువ. దానికి తోడు.. వాయు కాలుష్యం కూడా తోడైతే.. పరిస్థితి మరింత చేయి దాటిపోతుంది. వైరస్ ఇంకా ఈ లోకాన్ని వీడి పోలేదు. టీకా కూడా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో కరోనా సోకితే ఐసోలేషన్‌లో ఉంచడం, తాత్కాలిక చికిత్స చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. అందువల్ల.. అటు వైద్య బృందం, ఇటు ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి. కాస్త నిర్లక్ష్యం వహించినా.. దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అందరూ గ్రహిస్తే.. పెను ముప్పు నుంచి అందరూ బయటపడతారు. దీన్ని ఓ అంచనాగా కాకుండా.. ఓ అవకాశంగా భావిస్తే, కరోనాను కట్టడి చేయడం సులభమవుతుంది.
ముందు జాగ్రత్తగా..
కరోనావైరస్.. ఫ్లూ, ఇతర వింటర్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి లక్షణాలను ఎదుర్కోవటానికి అందరూ అలర్ట్‌గా ఉండాలి. అంటువ్యాధులను నిరోధించడానికి మరిన్ని ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ కేర్ ఫెసిలిటీస్‌ను మరింత పెంచుకోవాలి. కరోనా పరీక్షలను పెంచాలి. సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోకూడదు. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. డి విటమిన్ కోసం ఎండలో నిలబడాలి.