కరోనా వ్యాక్సిన్.. కొత్త కరోనా వైరస్ ను అడ్డుకుంటుందో లేదో

by Anukaran |
కరోనా వ్యాక్సిన్.. కొత్త కరోనా వైరస్ ను అడ్డుకుంటుందో లేదో
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాక్సిన్ కొత్త కరోనా వైరస్‌ ను అడ్డుకుంటుందా..? లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ పలు దేశాలకు చెందిన సైంటిస్ట్‌లు ఇప్పటికే తాము తయారు చేసిన వ్యాక్సిన్..,కరోనా కొత్త మ్యుటేషన్ వ్యాప్తిని అడ్డుకుటుందని ఘంటాపథంగా చెబుతున్నారు.‌ కానీ సౌతాఫ్రికాలో వేగంగా వ్యాపిస్తున్న వైరస్ కొత్త మ్యుటేషన్‌పై వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చని, అందుకే తాను ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు యూకే హెల్త్ సెక్రటరీ మ్యాట్ ఆన్ కాక్ తెలిపారు.ఈ విషయంపై అనుమానాల్ని నివృత్తి చేయాలని కాల్స్ వస్తున్నాయని, వాటికి రిప్లయ్ ఇవ్వలేకపోతున్నట్లు చెప్పారు.

యూకే గవర్నమెంట్ సైంటిఫిక్ అడ్వైజర్ తెలిపిన వివరాల ఆధారంగా.. సౌతాఫ్రికాలో వ్యాపిస్తున్న కరోనా కొత్త వైరస్ పై యూకే హెల్త్ సెక్రటరీ మ్యాట్ హన్ కాక్ ఆందోళనలో ఉన్నారు. అందుబాటులోకి వస్తున్న కరోనా వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చని, సౌతాఫ్రికాలో పనిచేయని వ్యాక్సిన్.. యూకేలో కొత్త మ్యుటేషన్ పై ఎలా పనిచేస్తుందంటూ ప్రశ్నిస్తున్నారని సౌతాఫ్రికా ఐటీవీ పొలిటికల్ ఎడిటర్ రాబర్ట్ పెస్టన్ చెప్పారు. ఇటీవల యూకే మరియు దక్షిణాఫ్రికా కొత్త కరోనా వైరస్ కేసుల్ని గుర్తించారు. దీనిపై సైంటిస్ట్‌లు సైతం ఇతర దేశాల కన్నా సౌతాఫ్రికాలో వ్యాపిస్తున్న కొత్త కరోనా మ్యూటేషన్ విభిన్నంగా ఉందని, వేగంగా వ్యాపించేందుకు స్పైక్ పొట్రీన్ మానవ కణాల్ని ఉపయోగించుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హ్యూమన్‌సెల్స్‌లో వైరస్ కణాలు ఎక్కవై, వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ రెజియస్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ జాన్ బెల్ సైతం కరోనా వ్యాక్సిన్ యూకేలో పనిచేస్తుందని, కానీ ఆదే వ్యాక్సిన్ సౌతాఫ్రికాలో వ్యాప్తిస్తున్న కొత్తకరోనా వైరస్ పై ప్రభావితం చూపిస్తుందా? అనేది ప్రశ్నార్ధకంగా మారిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed