- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూజీసీ నెట్ డిసెంబర్ 2020 నోటిఫికేషన్
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో లెక్చరర్ షిప్(అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం ప్రతిఏటా రెండుసార్లు నిర్వహించే యూజీసీ నెట్ (డిసెంబర్-2020) నోటిఫికేషన్ విడుదలైంది.
యూజీసీ నెట్-డిసెంబర్ 2020
- దేశవ్యాప్తంగా మొత్తం 101 విభాగాలకు మే నెలలో 224 సెంటర్ కేంద్రాల్లో యూజీసీ తరఫున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) యూజీసీ నెట్ పరీక్షను ఆన్‌లైన్ నిర్వహిస్తుంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55శాతం మార్కులతో సంబంధిత మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగులకు 50శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: లెక్చరర్‌షిప్ కోసం ఎగ్జామ్ రాసే వారికి ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు. కానీ, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం మాత్రం వయసు 31ఏళ్లకు(1 మార్చి 2021 నాటికి) మించరాదు. రిజిర్వేషన్ అభ్యర్థులకు (ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ, ఇతరులు) వయోపరిమితిలో ఐదేండ్ల వరకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.1000, ఓబీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ / దివ్యాంగులు రూ.250
ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష ద్వారా (సంబంధిత సబ్జెక్టు)
పరీక్ష ఎలా ఉంటుంది: పరీక్షలో మొత్తం రెండు పేపర్లు (పేపర్1 & పేపర్2) ఉంటాయి. రెండు పేపర్లలో కలిపి 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
పేపర్1లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున టీచింగ్ (బోధన, పరిశోధన), రీసెర్చ్ ఆప్టిట్యూడ్ (తార్కిక సామర్థ్యం, పఠన గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచన, సాధారణ అవగాహన) పై ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.
పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున సంబంధిత ఆప్షనల్ సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష సమయం 2గంటలు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 2 నుంచి
చివరితేదీ: 2 మార్చి, 2021
పేమెంట్ చేయడానికి చివరి తేదీ: 3 మార్చి
అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్: మార్చి 5 నుంచి 9 వరకు
యూజీసీనెట్ పరీక్షలు: మే నెలలో( 2 నుంచి 7 & 10 నుంచి 12 & 14 & 17)
వెబ్‌సైట్: https://ugcnet.nta.nic.in