- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒలింపిక్స్‌కు వచ్చి అదృశ్యమైన అథ్లెట్
దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వచ్చిన ఉగాండా అథ్లెట్ ఒకరు శిక్షణా శిబిరం నుంచి అదృశ్యమయ్యాడు. ఉగాండాకు చెందిన 9 మంది సభ్యుల బృందం జపాన్‌కు ముందుగానే చేరుకొని ఒసాకా రాష్ట్రంలోని ఇజుమిసానో పట్టణంలో శిక్షణ పొందుతున్నది. అయితే ఈ బృందంలోని 20 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ జూలియస్ సెకిటొలెకో శుక్రవారం నుంచి కనిపించకుండా పోయాడు. హోటల్ గదిలో, ఇతర చోట్ల అతడి కోసం వెతికినా జాడ దొరకలేదు.
దీంతో ఉగాండ అధికారులు వెంటనే టోక్యో ఒలింపిక్ నిర్వాహకులకు సమాచారం అందించడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం జపాన్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అథ్లెట్ అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తున్నది. సెకిటొలెకో పోలీసులు అతడి కోసం పూర్తి స్థాయిలో గాలిస్తున్నారు. కాగా, జులై 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. అథ్లెట్ల కోసం ఇప్పటికే ఒలింపిక్ విలేజ్‌ను కూడా ప్రారంభించారు. చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లు మొదటిగా క్రీడా గ్రామంలోకి ప్రవేశించారు.