వడ్డీ లేకుండా రూ.3,00,000 ఋణం.. అర్హతలు ఇవే..

by Anukaran |   ( Updated:2021-07-08 05:11:05.0  )
Udyogini Scheme Details
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏం పనిలేదు.. ఏదైనా వ్యాపారం చేస్తే బాగుండు అని ఆలోచన వచ్చిన మహిళలకు అండగా నిలవడానికి ఓ పథకాన్ని తీసుకొచ్చింది. వారికి అండగా నిలవడానికి, వంటింటికి పరిమితమైపోతున్న మహిళను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఉద్యోగిని’ పథకం పేరుతో వడ్డీ లేని రుణాలు ఇవ్వడం మొదలు పెట్టింది.

ఈ పథకంలో వడ్డీ లేకుండా రూ.3,00,000 లోన్ లభిస్తుంది. దీంతో మహిళలు తమకు నచ్చిన వ్యాపారం చేయవచ్చు. ఎలాంటి వ్యాపారానికైన ఈ లోన్ వర్తిస్తుంది. లోన్ తీసుకొని ఏం వ్యాపారం చేయాలి అని దిక్కుతోచని వారి కోసం.. అగర్‌బత్తీ తయారీ, బెకరీ, గాజుల తయారీ, బ్యూటీ పార్లర్, క్యాంటీన్, కేటరింగ్, క్లీనింగ్ పౌడర్, కాఫీ, టీ పౌడర్ తయారీ వంటి 88 రకాల వ్యాపారాలకి శిక్షణ ఇవ్వడానికి కొన్ని సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వారు చెప్పిన విధంగా మహిళలు ఆ కేంద్రాల్లో శిక్షణ పూర్తి చేస్తే చాలు ఇట్టే లోన్ వచ్చేస్తుంది. ఇక ఈ పథకం ద్వారా ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ కూడా ఇస్తుండటం విశేషం.

‘ఉద్యోగిని’ స్కీమ్‌లో లోన్ తీసుకోవడానికి కావాల్సిన అర్హతలు..

  • 25 నుంచి 55 ఏళ్ల వయసున్న మహిళలు.
  • మహిళల కుంటుంబ వార్షిక ఆదాయం రూ.1,50,000 లోపు ఉండాలి.
  • వికలాంగులు, వితంతువులకు వార్షిక ఆదాయం లిమిట్ వర్తించదు.
  • రీజనల్ రూరల్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, కో-ఆపరేటీవ్ బ్యాంకులు ఈ రుణాలను అందిస్తున్నాయి.
Advertisement

Next Story

Most Viewed