మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..ఇద్దరు యువకుల నిర్బంధం

by srinivas |   ( Updated:2021-11-08 03:00:37.0  )
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..ఇద్దరు యువకుల నిర్బంధం
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నంలో ఇటీవల ఏఅర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ జిల్లేపల్లి ప్రశాంతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రశాంతి మృతిపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రుద్రవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులే ఈ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. అయితే ఆ యువకులు ఇద్దరూ ప్రశాంతి తల్లిదండ్రులను పరామర్శించేందుకు రావడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులను బంధించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రశాంతి మృతికి ఆ యువకులకు ఉన్న సంబంధంపై విచారిస్తున్నారు.

Advertisement

Next Story