తిత్లీ తుఫానుకు రెండేళ్లు

by srinivas |   ( Updated:2020-10-11 09:43:51.0  )
తిత్లీ తుఫానుకు రెండేళ్లు
X

దిశ, ఏపీ బ్యూరో: రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజును తల్చుకొని శ్రీకాకుళం వాసులు వామ్మో అంటున్నారు. నాటి తిత్లీ తుపాను సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. కోనసీమగా పిల్చుకునే ఉద్దానం వణికిపోయింది. కొబ్బరి, జీడి రైతులను కకావికలం చేసింది. కళ్ల ముందే కష్టార్జితం పెనుగాలులకు ధ్వంసమైంది. పలాస, టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాలు గడగడలాడాయి. రైతులు విలవిల్లాడారు. సర్వం కోల్పోయిన కుటుంబాలు గుక్కెడు నీళ్ల కోసం అర్రులు చాచాయి. ఆ భయానక దృశ్యం కళ్లముందు కదిలాడుతున్నట్లే ఉందని పలాసకు చెందిన ఓ జీడితోట రైతు చెప్పాడు. కానీ అదే తిత్లీ తుపాను కొందర్ని కోట్లకు పడగలెత్తించింది. ప్రభుత్వ ధనాన్ని మేసేశారు. రైతుల పేరు చెప్పి ఇష్టారాజ్యంగా ప్రజల సొమ్మును దోచేశారు. వాస్తవంగా నష్టపోయిన రైతులకు 60శాతానికి మించి పరిహారం అందలేదు. నాటి ప్రభుత్వం విడుదల చేసిన రూ.307 కోట్లతో ఎక్కువగా బాగుపడింది నాయకులు, వారి అనుచరులేనని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత వాయుగుండం ఏం చేస్తుందోనన్న బెంగ రైతుల్లో నెలకొంది.

Advertisement

Next Story