- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బతుకుదెరువు కోసం వెళ్లి.. అనంతలోకాలకు
దిశ, సూర్యాపేట: బతుకుదెరువు కోసం పోయి బతుకులు ఆగం చేసుకుని వచ్చారు. సూర్యాపేట మండలం, అర్వపల్లి మండలం వలస కూలీలు కరోనా కష్టకాలంలో వరినాట్లు వేసేందుకు నిజాంబాద్ జిల్లా వెళ్లారు. పనులు ముగిసిన తర్వాత తిరిగి ఇంటి ముఖం పట్టారు. గురువారం అర్ధరాత్రి టాటా ఏసీలో వస్తుండగా వెనక నుంచి ట్రాన్స్‌పోర్టు లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యాపేట మండలం బాల్యంల, రామన్నగూడెం, అర్వ పల్లి మండలం కోడూరు కొమ్మల, అడివేముల, తిమ్మాపురానికి చెందిన కూలీలు 15 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు మృతి చెందారు. డ్రైవర్ సంతోష్ అక్కడి కక్కడికే మృతిచెందారు. చికిత్స పొందుతూ బాలెంల చెందిన ఎల్లయ్య మృతిచెందారు. మిగిలిన 13 మంది స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 60 మంది కూలీలు జూన్ 27న నిజాంబాద్ జిల్లా ఆర్మూర్‌లో వరి నాట్లు వేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అక్కడి ఆస్పత్రిలో అంతగా పట్టించుకోకపోవడంతో నాలుగు అంబులెన్సులో సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చారు. దీంతో బంధువులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది.