కరెంటు షాక్‎తో ఇద్దరు కూలీలు మృతి

by srinivas |   ( Updated:2020-10-23 04:09:47.0  )
కరెంటు షాక్‎తో ఇద్దరు కూలీలు మృతి
X

దిశ, వెబ్‎డెస్క్ : కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‎కు గురై ఇద్దరు కూలీలు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు సీతారామాంజనేయులు, చిన్న అనిల్ కుమార్‎గా గుర్తించారు. కూలీలు పొలంలో మందు పిచికారి చేయడానికి వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story