ఇద్దరు వివాహితలు అదృశ్యం

by Sumithra |
ఇద్దరు వివాహితలు అదృశ్యం
X

దిశ, పటాన్ చెరు: వేరు వేరు ఘటనలో ఇద్దరు వివాహితలు అదృశ్యమైన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ చెందిన శరత్ కుమార్ మెకానిక్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటి నుండి పనికి ఉదయం 6 గంటలకు వెళ్ళాడు. కాగా ఇంట్లో శరత్ అమ్మమ్మ సుభద్ర, భార్య భవాని ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుభద్ర స్నానం కోసం వెళ్లగా భవాని ఇంట్లో ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఇంటి నుండి వెళ్లిపోయింది. భవాని కోసం తెలిసిన వారి వద్ద బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. భార్య అదృశ్యంపై నారాయణ అనే వ్యక్తి పై అనుమానం ఉందని భర్త శరత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు ఎస్ఐ సాయిలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో లక్డారం గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 29వ తేదీన పనికి వెళ్లగా.. మధ్యాహ్నం స్థానికుల నుండి మీ ఇద్దరి పిల్లలు బజారులో తిరుగుతున్నారని ఫోన్ రావడంతో ఇంటికి వచ్చి చూసే సరికి భార్య రాజేశ్వరి ఇంట్లో లేదు. దీంతో అత్తకి ఫోన్ చేసి రాజేశ్వరి కనిపించడం లేదని మీ దగ్గరకు వచ్చిందా అని అడిగాడు. దీంతో అత్త రాలేదని సమాధానం చెప్పిందది. భార్య అదృశ్యంపై రవితేజ అనే వ్యక్తి పై అనుమానం ఉందని ప్రశాంత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed