బట్టల షాపులోకి దూసుకొచ్చిన బైకర్.. ఎగిరి కౌంటర్‌లో పడ్డాడు(వీడియో)

by Anukaran |
బట్టల షాపులోకి దూసుకొచ్చిన బైకర్.. ఎగిరి కౌంటర్‌లో పడ్డాడు(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: యాక్సిడెంట్‌.. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ విధంగా జరుగుతుందో ఊహించలేము. కానీ, జరిగిన క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. కొన్ని ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపితే.. మరి కొన్ని నవ్వులు పూయిస్తాయి. ఇలాంటి ప్రమాదమే ఖమ్మం జిల్లాలో చోటుచేసుకోగా.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

నగరంలోని రావిచెట్టు బజార్‌లో ఓ బట్టల షాపులో షాపు యజమానితో పాటు ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు ముచ్చటిస్తున్నారు. షాపు బయటినుంచి ఏదో వేగంగా వస్తోందని కండ్లు తిప్పేలోపు ఓ బైకర్‌ గుండె ఆగిపోయినంత పనిచేశాడు. పల్సర్‌ బైక్‌ మీద అతివేగంతో నేరుగా షాపులోకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో షాపులో పేర్చిన బట్టలను ఢీ కొట్టి ఎగిరిపోయి కౌంటర్‌లో పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి, బైక్‌కు ఏమీ కాకపోగా.. షాపులోని వారు తృటిలో తప్పించుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సూపర్ డ్రైవింగ్ అంటూ పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Next Story