- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ నుంచి ఇద్దరు అంపైర్లు ఔట్
దిశ, స్పోర్ట్స్ : దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఐపీఎల్ ఆడుతున్న పలువురు క్రికెటర్లు లీగ్ నుంచి బయటపడి స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆండ్రూ టై, అడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, రవిచంద్రన్ అశ్విన్ తొలి విడత మ్యాచ్‌ల అనంతరం ఐపీఎల్ నుంచి నిష్క్రమించారు. తాజాగా ఇద్దరు అంపైర్లు కూడా ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్లైన నితిన్ మీనన్, పాల్ రీఫిల్ ఐపీఎల్ బాధ్యతలను వదిలేసి వెళ్లిపోయారు.
నితిన్ మీనన్ తల్లి, భార్య కరోనా బారిన పడ్డారు. ఈ సమయంలో వారికి తోడుగా ఉండాలని భావించి ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఆస్ట్రేలియా ప్రభుత్వం విమానాల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించడంతో పాల్ రీఫిల్ త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఐపీఎల్‌ను వదిలేశారు. ఈ విషయం బీసీసీఐ అధికారి ఒకరు ధృవీకరించారు. ఇద్దరు సీనియర్ అంపైర్లు తప్పుకోవడంతో బీసీసీఐ ఆందోళన చెందుతున్నది. ప్రస్తుతానికి బ్యాకప్ అంపైర్ల సేవలు వినియోగించుకోనున్నట్లు బీసీసీఐ అధికారులు చెప్పారు.