- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడవీ నాదే.. వేటా నాదే.. ఫారెస్ట్‌లోకి వెళ్లిన వేటగాళ్లు చివరకు..
దిశ, ములకలపల్లి : అడవి జంతువుల కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూకమామిడి పంచాయతీ మొగరాలగుప్ప గ్రామానికి చెందిన పాయం జాన్ బాబు(23), కూరం దుర్గారావు (40) ఇద్దరూ అడవి జంతువులను వేటాడేందుకు సోమవారం రాత్రి టార్చ్‌లైట్ తీసుకొని వేటకు వెళ్లారు.
పూసుగూడెం మాధారం మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలను చూసుకోకుండా వారు కరెంట్ తీగలకు తగిలారు. ఈ క్రమంలో కొన ఊపిరితో తమ కుటుంబ సభ్యులకు సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే జాన్ బాబు మృతి చెందాడు.
దుర్గారావు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.