స్పెషల్ ట్రైన్స్..

by srinivas |
స్పెషల్ ట్రైన్స్..
X

దిశ, వెబ్‌డెస్క : సంక్రాంతి పండుగ సందర్భంగా ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆదివారం నుంచి రెండు స్పెషల్ రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే సిద్దపడింది. అందులో భాగంగానే నర్సాపూర్-సికింద్రాబాద్ రైలును నడపనున్నారు. ఈ రైలు నర్సాపూర్‌లో సాయంత్రం 5.35నిమిషాలకు బయలుదేరి సోమవారం ఉదయం 4.10కు సికింద్రాబాద్‌కు చేరుతుంది.

అదే విధంగా అనకాపల్లి-సికింద్రాబాద్‌ మరో రైలును నడపనున్నారు. ఇది అనకాపల్లిలో ఆదివారం రాత్రి 8.50కు బయలుదేరి రేపు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story