- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికొడుకుకు వధువు బంపర్ ఆఫర్.. తనకు తాళికడితే తన చెల్లెలు ఫ్రీ
దిశ, వెబ్డెస్క్: అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి.. కొద్దిసేపటిలో వరుడు, వధువు మెడలో తాళి కట్టడానికి రెడీ గా ఉన్నాడు. బంధువులు, స్నేహితులు చేతిలో అక్షింతలు పట్టుకొని ఎదురుచూస్తున్నారు. వరుడు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. వరుడు, వధువు మెడలో తాళికట్టబోతుండగా.. ఆమె గట్టి షాక్ ఇచ్చింది. ఈ పెళ్లి జరగాలంటే నాదో కండీషన్ అని చెప్పింది. వధువు మాటకు షాక్ అయిన వరుడు, బంధువులు ఆమె ఏం చెప్పబోతోందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే పెళ్లిమండపంలో తనతో పాటు తన చెల్లికి కూడా తాళి కట్టాల్సిందిగా వరుడును కోరింది. వధువు కోరిన వింత కోరికతో అక్కడివారంతా షాక్కయ్యారు. కానీ వధువు కోరిన కోరిక తప్పులేదని అందరు గ్రహించి అక్కాచెల్లిద్దరికి ఒకే వ్యక్తితో పెళ్లిచేసి వింత ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది.
తిమ్మరావుతనహళ్ళి గ్రామ పంచాయతీ వేగమడుగు గ్రామానికి చెందిన రాణెమ్మ, నాగరాజప్ప రైతు దంపతులకు సుప్రియ, లలిత అనే ఇద్దరు కుమార్తెలున్నారు. చెల్లెలు లలిత మూగ–బధిర. చిన్నతనంనుండి అక్కను విడిచి పెట్టేది కాదు. తాను పెళ్లిచేసుకొని వెళిపోతే చెల్లెలిని ఎవరు పెళ్లిచేసుకొంటారు? ఎవరు తనను చూసుకొంటారని సుప్రియ బాధపడేది. ఈ నేపథ్యంలోనే సుప్రియకు బాగేపల్లికి చెందిన ఉమాపతి అనే యువకునితో పెళ్లి నిశ్చయమైంది. మే 7 న పెళ్లి తంతు జరుగుతుండగా సుప్రియను ఓ ఆలోచన వచ్చింది. తనకు కాబోయే భర్త చేత చెల్లికి కూడా తాళికట్టిస్తే ఇద్దరు ఒకే చోట ఉండొచ్చు, చెల్లికి పెళ్లి కూడా అయిపోతుంది అని అనుకోంది. వెంటనే తాళి కట్టేముందు పెళ్లి ఆపి తన మనసులోని మాట వరుడికి చెప్పింది. చెల్లిని కూడా నీవు పెళ్లాడితే కానీ ఈ వివాహం జరగదని తేల్చి చెప్పింది. దీంతో వరుడు, తన పెద్దల అంగీకారంతో అక్కాచెల్లెళ్ల మెడలో మాంగల్యధారణ చేశాడు. ప్రస్తుతం ఈ పెళ్లి నెట్టింట వైరల్ గా మారింది.