సింగరేణి బొగ్గు గనిలో మరో ఘోర ప్రమాదం..

by Aamani |
singareni
X

దిశ, మంచిర్యాల : సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 న్యూటెక్ గనిలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఫస్ట్ షిఫ్ట్‌లో భాగంగా వినోద్, రవి అనే ఇద్దరు కార్మికులు విధులు నిర్వహిస్తుండగా పని స్థలంలో ఒక్కసారిగా సైడ్ వాల్ కూలింది. దీంతో ఇరువురిపై బొగ్గు పెళ్లలు పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన తోటి కార్మికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో గాయపడిన వారిని హుటాహుటిన గనిపైకి తీసుకొచ్చి రామకృష్ణాపుర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రమాద ఘటనపై సింగరేణి అధికారులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story