- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొక్కుకని వచ్చారు.. మునిగిపోయారు
దిశ,మణుగూరు : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారక్క అమ్మవార్ల జాతరలో విషాదం నెలకొంది. మొక్కు తీర్చుకుందామని వచ్చిన ఇద్దరు యువకులు వాగులో గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాలలోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని కొత్త కొండాపురం గ్రామానికి చెందిన ఉడిముడి కోటేశ్వరరావు(30), బంగారి శ్యామలరావు(21) సోమవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లారు.
అయితే అక్కడ జంపన్నవాగులో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో స్నేహితులు దిగడానికి ముందు తటపటాయించారు. కానీ, రెండు మెట్లు దిగి చూద్దాం అని స్నేహితుడు చెప్పగా ఇద్దరు రెండు మెట్లు దిగి నీటిలోకి అడుగుపెట్టారు. దిగి చూద్దాం అని వెళ్లిన ఇద్దరు మళ్ళీ రాలేదని పైన ఉన్న స్నేహితులు తెలిపారు. స్నేహితుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు గల్లంతైనవారు కనిపించకపోవడంతో వారు మృతిచెంది ఉంటారని అనుమానిస్తున్నారు.