నగరంలో విషాదం : సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు..

by Shyam |
నగరంలో విషాదం : సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే ప్రయత్నంలో ఊపిరాడక ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన కొండాపూర్‌లో ఆదివారం ఉదయం జరిగింది. చాలా రోజుల నుంచి అపార్ట్ మెంట్ సెల్లార్‌‌లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయకపోవడంతో, విష వాయువుల వల్లే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల నల్లగొండ జిల్లా గాజీపూర్‌కు చెందిన వారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed