కర్నూలులో బ్లాక్ ఫంగస్‌ కలకలం

by srinivas |
కర్నూలులో బ్లాక్ ఫంగస్‌ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా నుంచి కోలుకున్నామని ఊపిరిపీల్చుకునేలోపే వారిని బ్లాక్ ఫంగస్ వెంటాడుతుంది. కరోనా సోకి తగ్గిన వారు, ఇతరత్రా దీర్ఘకాలిక సమస్యలతో భాదపడుతున్న వారిలోనూ అలానే మధుమేహం చక్కెర వ్యాధి ఎక్కువగా ఉండి నియంత్రణలో లేని వారికి , వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వారిలో బ్లాక్ ఫంగస్ గా పిలవబడే మ్యూకర్ మైకోసిస్ వ్యాధి అధికంగా కనిపిస్తుందది. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ లో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తుంది. కర్నూలు జిల్లాలో జీజీహెచ్ లో బ్లాక్ ఫంగస్ తో ఇద్దరు మృతి చెందారు. అయితే మృతులు అనంతపురం, గుంటూరు జిల్లాల వాసులుగా గుర్తింపు. బ్లాక్ ఫంగస్‌తో ఇద్దరు మరణించడంతో అక్కడి ప్రజలలో ఆందోళనలు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed