నారాయణపేట జిల్లాలో రెండు కొత్త మండలాలు..

by Shyam |
నారాయణపేట జిల్లాలో రెండు కొత్త మండలాలు..
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లాలో మరో రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జిల్లాలో 11 మండలాలు ఉండగా కోస్గి, మద్దూరు మండలాలు అతి పెద్దవిగా ఉండడం, వీటిలో కొన్ని గ్రామాలు మండలాల ఏర్పాటుకు అర్హతలు కలిగి ఉండడంతో ప్రజలు తమ గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రజల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కోస్గి, మద్దూరు మండలాల్లోని కొన్ని గ్రామాలను విలీనం చేసి గుండుమల్, కొత్తపల్లి మండలాలను ప్రకటించారు.

గుండుమల్ మండలంలో ఇప్పటివరకు కోస్గి పరిధిలో ఉన్న సారంగరావుపల్లి, గుండుమల్, బోగారం, భక్తి మల్ల, బలభద్ర పల్లె, అమ్మి కుంట, ముదిరెడ్డిపల్లిని చేర్చారు.

మద్దూరు మండలంలోని కొమురెల్లి, వీరా రామ్ మడక గ్రామాలను కలిపి కొత్త మండలంగా ఏర్పాటు చేశారు.

కొత్తపల్లి మండలంలో ఇప్పటివరకు మద్దూరు పరిధిలో ఉన్న నిడిజింత, భూనేడు, దుప్పటిగట్, గోకుల్ నగర్, తిమ్మారెడ్డిపల్లి, పెద్దాపూర్, లింగాలు చేడ్, నందిగాం, అల్లిపూర్ గ్రామాలను కలిపి కొత్త మండలంగా ఏర్పాటు చేశారు.

దీంతో నారాయణపేట జిల్లాలో మండలాల సంఖ్య 13 కు చేరింది. నూతన మండలాల్లో పరిపాలన త్వరలోనే ఆరంభంకానుంది.

Advertisement

Next Story

Most Viewed