సిద్దిపేటకు కీర్తి కిరీటం.. అదే దారిలో హుస్నాబాద్.. ఢిల్లీలో అవార్డులు..

by Shyam |   ( Updated:2021-11-11 11:10:49.0  )
సిద్దిపేటకు కీర్తి కిరీటం.. అదే దారిలో హుస్నాబాద్.. ఢిల్లీలో అవార్డులు..
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట మరో కీర్తి కీరిటం దకంచుకోవడంతో మరో సారి భారతాన సిద్దిపేట పేరు మారు మ్రోగింది. స్వచ్ సర్వేక్షన్ 2021 అవార్డును సిద్దిపేట పట్టణం కైవసం చేసుకుంది. మంత్రి హరీష్ రావు స్పూర్తితో వారి మార్గదర్శనం తో ఇప్పటికే పట్టణం లో పరిశుభ్రత, పచ్చదనం , తడి పొడి చెత్త సేకరణ ఇలా ఎన్నో అంశాల పై 17 రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులు సాధించి దేశంలోనే శుద్దిపేట గా గుర్తింపు పొందింది.

ఈనెల 20న ఢిల్లీ లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకొన్నున మున్సిపల్ చైర్మన్, కమిషనర్.
స్వచ్ఛ సర్వేక్షన్ లో సిద్దిపేట పట్టణం జాతీయ స్థాయిలో ఎంపిక కాగా ఈనెల ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో అవార్డ్ ల ప్రధానం ఉంటుందని రావాల్సిందిగా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, కమిషనర్ రమణాచారి లకి ఆహ్వానం అందింది. ఈ మేరకు 20న విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఇద్దరు అవార్డ్ లను సిద్దిపేట ప్రజల పక్షాన అందుకొనున్నారు.

సిద్దిపేట మున్సిపాలిటీకి వచ్చిన జాతీయస్థాయి అవార్డులు ..
2015 ఎక్సలెన్స్ అవార్డు ( సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ) 2016 ఎక్స్లెన్స్ అవార్డు ( పారిశుద్ధ్య నిర్వహణ ) 2016 స్కోచ్ అవార్డు చెత్త సేకరణ , ( 100 % మరుగుదొడ్ల నిర్మాణం ) 2016 ఓడీఎఫ్ సర్టిఫికెట్, 2017 రాష్ట్రీయ స్వచ్ఛ భారత్ పురస్కార్, 2017 ఐఎస్ఓఓ అవార్డు, 2018 సాలిడ్ మేనేజ్మెంట్లో స్కోచ్ అవార్డ్, 2018 స్వచ్ఛత ఎక్స్ లెన్స్ అవార్డు, 2018 స్కోచ్ అవార్డ్, 6 పద్ధతులు అమలులో ఉన్నందున .. 2018 స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రథమ స్థానం, 2019 స్వచ్ఛత ఎక్స్ లెన్స్ అవార్డు, 2019 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు ( దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో ), 2021 తాజాగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు.

రాష్ట్రస్థాయిలో ..
2012 క్లీన్ సిటీ ఛాంపియన్షిప్ అవార్డు, 2016 హరితమిత్ర అవార్డు , 2016 ఎక్స్లెన్స్ అవార్డు, 2017 బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు, 2021 100 % ఇంటింటికీ స్వచ్ఛ తాగునీటి సరఫరాకు రెండు స్కోచ్ అవార్డులు.

హుస్నాబాద్ మున్సిపాలిటీకి..
స్వచ్ఛ సర్వేక్షణ్ 2020-21 పోటీల్లో హుస్నాబాద్ మున్సిపాలిటీ సైతం అవార్డు దక్కించుకుంది. ప్రభుత్వం చేపట్టే పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణాల సుందరీకరణ, మౌళిక సదుపాయాల కల్పన, పబ్లిక్ టాయిలెట్లు, వ్యక్తిగత మరు గుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛ ఆటోలతో పాటు తెలంగాణ మున్సిపల్ చట్టంలోని అనేక అంశాలు ఈ అవార్డు రావడానికి దోహదపడ్డాయి.

Advertisement

Next Story