డీసీఎం, బైక్ ఢీ.. ఇద్దరు మృతి

by Sumithra |
డీసీఎం, బైక్ ఢీ.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ :

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని డీసీఎం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన నగరంలోని శంషాబాద్ గండి గూడ వద్ద శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

ప్రమాదం జరిగిన సమయంలో మృతులు శంషాబాద్ నుంచి పాలమకుల వైపుగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story